విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ముట్టడి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ముట్టడి

Sep 25 2026 2:35 AM | Updated on Sep 25 2026 2:35 AM

శాలిగౌరారం : మండల కేంద్రంలోని బీసీ కాలనీలో విద్యుత్‌ ట్రాన్స్‌పార్మర్‌ పేలిపోయి బుధవారం రాత్రి కాలనీ మొత్తం పూర్తిగా అంధకారంలోనే ఉంది. స్థానికులు విద్యుత్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. వర్షం కురుస్తుండటంతో విద్యుత్‌ సరఫరాను పునురుద్ధరించలేదు. గురువారం రాత్రి వరకు కూడా కరెంట్‌ రాకపోవడంతో విషయాన్ని సంబంధిత ఏఈ, లైన్‌మెన్‌ దృష్టికి తీసుకెళ్లారు. వారి నుంచి నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో ఆగ్రహానికి గురైన కాలనీవాసులు సుమారు 200 మంది 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. సబ్‌స్టేషన్‌లోని లైన్‌మెన్‌, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సబ్‌స్టేషన్‌ యార్డు ఆవరణలోకి చొచ్చుకొని వెళ్లి విద్యుత్‌ సరఫరా మొత్తం నిలిపివేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విద్యుత్‌ సిబ్బందికి, కాలనీవాసులకు తోపులాట జరిగింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు చేరుకున్న పోలీసులు కాలనీవాసులతో మాట్లాడి నచ్చజెప్పారు. నల్లగొండ నుంచి మరో ట్రాన్స్‌ఫార్మర్‌ను తీసుకొచ్చి రాత్రి ఆలస్యంగా విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement