ఫ ఐలమ్మకు నివాళి | - | Sakshi
Sakshi News home page

ఫ ఐలమ్మకు నివాళి

Sep 11 2026 12:02 PM | Updated on Sep 11 2026 12:02 PM

867 మందికి ఇందిరమ్మ ఇళ్ల బిల్లు

రామన్నపేట: ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు వచ్చాయి. జిల్లాలో ఇప్పటి వరకు 867మంది లబ్ధిదారుల ఖాతాల్లో సుమారు రూ.9.40కోట్లను ప్రభుత్వం జమ చేసింది. రాష్ట్రప్రఽభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో మొదటి దశలో జిల్లాకు 9,861 ఇళ్లను మంజూరు చేసింది. వాటిలో 5,200 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. వీటిలో బేస్‌మెంట్‌ పూర్తయిన తరువాత రూ. 1లక్ష, గోడలు నిర్మించిన తరువాత మరో లక్ష, స్లాబ్‌వేసిన వెంటనే రూ 1.40లక్షల చొప్పున చెల్లించింది. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి ఈజీఎస్‌ నుంచి రూ 12వేలు జమ అయ్యాయి. 90రోజుల పని కల్పించడం ద్వారా రోజుకు రూ .307ల చొప్పున చెల్లిస్తోంది. ఇంటి నిర్మాణం పూర్తయిన 5,200మంది లబ్ధిదారులకుగాను రాష్ట్ర ప్రభుత్వం చివరిబిల్లు కింద 700 మంది లబ్ధిదారులకు రూ 1,20,000ల చొప్పున వారి ఖాతాల్లో జమ చేసింది. అదేవిధంగా పైలట్‌ప్రాజెక్టులో భాగంగా ఇళ్లు కట్టుకొని స్లాబ్‌దశలో రూ. 2లక్షల బిల్లు పొందిన 167మంది లబ్ధిదారులకు రూ. 60వేల చొప్పున జమ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement