చౌటుప్పల్ : స్థానిక పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలివ్వాలనే డిమాండ్‌తో ఉద్యమించనున్నామని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ తెలిపారు. చౌటుప్పల్‌లో గురువారం డీవైఎఫ్‌ఐ జిల్లా మహాసభలో వారు మాట్లాడారు. యువత సమస్యలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. స్థానిక పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేలా ప్రభుత్వం చట్టం తీసుకురావాలన్నారు. సభలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి గడ్డం వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు పల్లె మధుకృష్ణ, నాయకులు సురేష్‌దయ్యాల, మల్లేష్, సలీం, రత్నం శ్రీకాంత్, పల్లె శివకుమార్, గండని లక్ష్మీపతి, బోదాసు నరేష్, నత్తి నరేష్, జంగిలి సాయి, బాలెం నరేష్, బర్రె రాజు,శశి తదితరులు పాల్గొన్నారు.
ఫ డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, కార్యదర్శి వెంకటేష్


