తుక్కాపూర్‌లో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ముట్టడి | - | Sakshi
Sakshi News home page

తుక్కాపూర్‌లో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ముట్టడి

Sep 11 2026 12:02 PM | Updated on Sep 11 2026 12:02 PM

భువనగిరిటౌన్‌ : సమయానికి విద్యుత్‌ సరఫరా చేయకపోవడంతో పాటు లో–ఓల్టేజీ, సప్లయ్‌లో తీవ్ర అంతరాయాలను నిరసిస్తూ భువనగిరి మండల పరిధిలోని తుక్కాపూర్‌ గ్రామ రైతులు, ప్రజాప్రతినిధులు స్థానిక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ గురువారం ముట్టడించారు. ఈ సందర్భంగా తుక్కాపూర్‌ సర్పంచ్‌ జనగాం పాండు మాట్లాడుతూ గ్రామంలో వ్యవసాయానికి సరైన సమయానికి విద్యుత్‌ అందించడం లేదన్నారు. సరఫరా సమయంలోనూ తీవ్ర లోఓల్టేజీ ఉంటుందని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన లైన్‌మన్‌ ఎల్‌సీ పేరుతో రోజులో అనేకసార్లు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల విద్యుత్‌ కూడా సరిగ్గా సరఫరా కాకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని, అధికారుల నిర్లక్ష్య వైఖరి నచ్చకే రైతులంతా కలిసి సబ్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ నోముల మహేందర్‌ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాసాల మల్లేష్‌ యాదవ్‌, నల్లమాస సత్యనారాయణ, గ్రామ శాఖ అధ్యక్షుడు రాసాల శేఖర్‌ యాదవ్‌, ఉప సర్పంచ్‌ రాసాల లింగస్వామి యాదవ్‌, వార్డు సభ్యులు ఎలకొండ శేఖర్‌ రెడ్డి, శరత్‌, ఎలకొండ సుధాకర్‌ రెడ్డి, దండమోని నరసింహ, దండేమోని పాండు, దానయ్య, రైతులు ఏదునూరి వెంకయ్య, కొసని వెంకటేష్‌, జక్కిడి శేఖర్‌ రెడ్డి, కంటం రాజమోహన్‌, జనగాం మహేష్‌, రాసాల భూలోక్‌, రత్నపురం శ్రీనివాస్‌, రాసాల మల్లయ్య, రాసాల క్రాంతి, దండముని రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement