క్రికెట్‌లో మెరిసిన గిరిబాబు | - | Sakshi
Sakshi News home page

క్రికెట్‌లో మెరిసిన గిరిబాబు

Sep 10 2026 3:44 AM | Updated on Sep 10 2026 3:44 AM

ఓ వైపు ఉద్యోగం.. మరోవైపు సాధన

మెట్ల మార్గంలో పైకప్పు నిర్మాణానికి శంకుస్థాపన
ఐఐటీ–హెచ్‌ను సందర్శించిన ఎంజీయూ అధ్యాపకులు

అక్టోబర్‌ 1 నుంచి పంజాబ్‌లో జరిగే జాతీయ స్థాయి టీ10 పోటీలకు ఎంపిక

సంస్థాన్‌ నారాయణపురం : పట్టుదల, నిరంతర సాధనతో సంస్థాన్‌ నారాయణపురం గ్రామానికి చెందిన యువ క్రీడాకారుడు సుక్క గిరిబాబు జాతీయ స్థాయి క్రికెట్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 7న హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి టీ–10 క్రికెట్‌ ఎంపిక పోటీల్లో ఆయన అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. దీంతో టీ–10 క్రికెట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో పంజాబ్‌లోని బటాలాలో అక్టోబర్‌ 1 నుంచి 4వ తేదీ వరకు జరగనున్న 3వ సీనియర్‌ నేషనల్‌ టీ–10 క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు.

గ్రామం నుంచే క్రీడా ప్రస్థానం..

న్ననాటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకున్న గిరిబాబు.. చదువుతో పాటు ఆటల్లోనూ రాణిస్తూ వస్తున్నారు. నారాయణపురంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో పాఠశాల విద్యను, స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. చౌటుప్పల్‌లోని మాతశ్రీ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదివారు. క్రీడలనే భవిష్యత్తుగా ఎంచుకుని తంగడపల్లిలోని కళాశాలలో బీపీఈడీ, ఎంపీఈడీ అభ్యసిస్తూనే క్రికెట్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.

జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు..

రాష్ట్ర స్థాయి ఎంపికల్లో సత్తా చాటి జాతీయ స్థాయికి ఎంపికై న గిరిబాబు.. పంజాబ్‌లో జరిగే సీనియర్‌ నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌ కోసం ముమ్మరంగా సన్నద్ధమవుతున్నారు. అక్కడ కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో ఉన్నారు. సాధారణ గ్రామీణ నేపథ్యం నుంచి జాతీయ స్థాయికి ఎదగడం పట్ల గ్రామస్తులు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. గిరిబాబు ఎంపిక పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, గ్రామ పెద్దలు, స్నేహితులు అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలోనూ రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

క్రికెట్‌

ఆడుతున్న గిరిబాబు

వందేళ్ల పుట్టినరోజు వేడుకలు

చిలుకూరు : మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన రెణబోతు రాములమ్మ వందేళ్ల పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. వేడుకల్లో ఆమె ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుళ్లు, మనవళ్లు, మునిమనవలు, మనవరాళ్లు, మునిమనవరాళ్లు పాల్గొన్నారు.

యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వైకుంఠద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గం వరకు భక్తులకు నీడను కల్పించేందుకు ఏర్పాటు చేయనున్న పైకప్పు(టెన్సిల్‌ కానోపి) పనులకు బుధవారం ఈఓ భవానీశంకర్‌ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. ఎం.ఎస్‌. అగర్వాల్‌ ఫౌండ్రీస్‌ సంస్థ తరఫున ప్రమోద్‌ అగర్వాల్‌ రూ.1.50 కోట్లతో ఈ పైకప్పు నిర్మాణ పనులను చేయిస్తున్నారని వెల్లడించారు. సదరు కంపెనీ ప్రెసిడెంట్‌ సుజయ్‌ సమక్షంలో ఈ శంకుస్థాపన పూజలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరలోనే ఈ పనులను ప్రారంభించి, పూర్తి చేయనున్నట్లు ఈఓ వివరించారు.

నల్లగొండ టూటౌన్‌ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) అధ్యాపకుల బృందం మంగళవారం హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్‌ను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఐఐటీలోని వివిధ విభాగాలలో కొనసాగుతున్న అత్యాధునిక పరిశోధనలు, అక్కడ అందుబాటులో ఉన్న మెరుగైన విద్యా వసతుల గురించి అక్కడి ప్రొఫెసర్లను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఎంజీయూ, ఐఐటీహెచ్‌ సంయుక్తంగా చేపట్టదగిన పరిశోధనా అంశాలపై అధ్యాపకులు చర్చించారు. ఈ పర్యటనలో ప్రిన్సిపాళ్లు అరుణప్రియ, హరీష్‌కుమార్‌, వై. ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

ప్రస్తుతం గిరిబాబు నారాయణపురం గిరిజన గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్‌ పద్ధతిన పీఈటీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఓ వైపు ఉద్యోగ బాధ్యతలు చూసుకుంటూనే, మరోవైపు లక్ష్య సాధన కోసం మైదానంలో నిరంతరం శ్రమిస్తున్నారు. విధులు ముగిసిన తర్వాత క్రికెట్‌ ప్రాక్టీస్‌కు సమయం కేటాయిస్తూ తన ఆటతీరును మెరుగుపరుచుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement