ఫ సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి
యాదగిరిగుట్ట : యువత ప్రజా ఉద్యమాల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ సోషలిస్టు సమాజ నిర్మాణం కోసం పోరాటం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలో జరుగుతున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర మూడో మహాసభల్లో భాగంగా బుధవారం రెండో రోజు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. యువత ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. సోషలిస్టు సమాజ నిర్మాణమే లక్ష్యంగా యువత ముందుకు సాగాలన్నారు. అమరుల త్యాగాలను స్మరించడమే కాకుండా వారి ఆశయాలను ఆచరణలో పెట్టడమే వారికి నిజమైన నివాళి అన్నారు. అనంతరం ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుఖ్‌జిందర్ మహేశ్వరీ మాట్లాడుతూ.. ఉద్యోగాలు, విద్య, ప్రజాస్వామ్య హక్కులు, సామాజిక న్యాయం కోసం ప్రశ్నిస్తున్న జెన్–జీ యువతను దిమాగీ నక్సల్స్ అంటూ ముద్ర వేయడం చాలా బాధకరమన్నారు. యువతకు ఉపాధిని హక్కుగా కల్పించేందుకు ఏఐవైఎఫ్ ప్రతిపాదిస్తున్న భగత్‌సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు యానాల దామోదర్‌రెడ్డి స్వాగతోపన్యాసం చేయగా, సీనియర్ నాయకుడు రేగు సిద్దయ్య అమరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేర్లకంటి శ్రీకాంత్ తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈ ప్రతినిధుల సభకు అధ్యక్ష వర్గంగా వలి ఉల్లా ఖాద్రీ, గంగోత్రి, ఉమా, మమత, కునుకుట్ల శంకర్, తీర్పారీ వెంకటేశ్వర్లు, బిజ్జా శ్రీనివాసులు, పేరబోయిన మహేందర్ వ్యవహరించారు. సౌహార్ధ సందేశాలను ఏఐవైఎఫ్ ఏపీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంతోష్ కుమార్, యుగంధర్, భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.జ్యోతి, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కురుమీద్ది శ్రీనివాస్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షులు రోషన్ కుమార్ సిన్హా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు లింగం రవి, టి. సత్యప్రసాద్, శ్రీమాన్, యుగంధర్, చేవూరి కొండల్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, చేడే చంద్రయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు గోద శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, బండి జంగమ్మ, కొల్లూరి రాజయ్య, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు నహీం, బద్దుల శ్రీనివాస్, శేఖర్‌రెడ్డి, కల్లెపల్లి మహేందర్, బబ్బూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


