వినాయక చవితి ఉత్సవాల వేళ ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలు, ఉత్సవ నిర్వాహకులు తగిన భద్రతా నిబంధనలు పాటించాలని టీజీఎస్పీడీసీఎల్ విజ్ఞప్తి చేసింది. పండుగ సంబరాల్లో విద్యుత్ భద్రతపై సంస్థ ప్రత్యేక అవగాహన మార్గదర్శకాలను విడుదల చేసింది.
భువనగిరిటౌన్ : వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని మండపాల ఏర్పాటు, నిమజ్జన ఊరేగింపుల కోసం నిర్వాహకులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోలీసు శాఖ సాంకేతిక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉత్సవాల నిర్వహణ అనుమతుల కోసం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఈ–పోర్టల్ సేవలను ప్రారంభించింది.
డిజిటల్ ఎన్‌ఓసీ పొందే విధానం
పోలీసు శాఖ మార్గదర్శకాలు
● ప్రధాన రహదారులు, రద్దీ కూడళ్లలో పాదచారులు, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా మండపాలు ఏర్పాటు చేయాలి.
● మండపాల వద్ద పూజా సామగ్రి, అగ్గిపెట్టెలు, హారతుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అగ్నిమాపక జాగ్రత్తలు అందుబాటులో ఉంచాలి.
● అనుమతించిన సమయంలో మాత్రమే మైకులు వాడాలి. డీజేలు, అధిక శబ్ధాలు చేసే స్పీకర్లను పూర్తిగా నివారించి ధ్వని కాలుష్య నిబంధనలు పాటించాలి.
● స్థానిక ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి.
● ఏవైనా సమస్యలు లేదా అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే నిర్వాహకులు, ప్రజలు డయల్ 100 లేదా 112 నంబర్లకు ఫోన్ చేసి పోలీసుల సహకారం తీసుకోవాలి.
నిర్వాహకులు పాటించాల్సిన జాగ్రత్తలు
● విద్యుత్ లైన్లకు తగినంత దూరంలో మాత్రమే మండపాలను ఏర్పాటు చేయాలి. లైన్ల కింద లేదా వాటికి దగ్గరగా మండపాలు, అలంకరణలు చేయొద్దు.
● విద్యుత్ తీగలను తాకేలా ఎలాంటి లైటింగ్, స్వాగత తోరణాలు ఏర్పాటు చేయొద్దు.
● విద్యుత్ స్తంభాలకు జెండాలు, బ్యానర్లు, అలంకరణ సామగ్రి కట్టడం అత్యంత ప్రమాదకరం.
● ప్రతి మండపంలో సరైన ఎర్తింగ్ ఉండేలా చూసుకోవడంతో పాటు షార్ట్ సర్క్యూట్లు, షాక్ నివారణకు ఈఎల్సీబీ లేదా ఆర్సీసీబీ పరికరాలను తప్పనిసరిగా అమర్చాలి.
● ఎక్కడైనా తీగలు తెగిపడినా, స్పార్కింగ్ లేదా విద్యుత్ లీకేజీ గమనించినా వెంటనే అధికారులకు తెలపాలి.
ఫ సాంకేతిక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన పోలీసు శాఖ
ఫ డిజిటల్ ఎన్‌ఓసీ పత్రాన్ని నేరుగా
డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం


