ఈయన గుండాల మండలం నూనెగూడెం గ్రామానికి చెందిన మలిపెద్ది మాధవరెడ్డి. తన తల్లి పేరిట నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి, తహసీల్దార్ సహకారంతో 4 ఎకరాల 1 గుంట భూమిని తన బంధువు అక్రమంగా పట్టా చేసుకున్నాడని ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఇంత వరకు అతడిపై చర్యలు తీసుకోలేదని మాధవరెడ్డి పేర్కొంటున్నాడు. ఇలా పరిష్కారానికి నోచుకోని ప్రజావాణి ఫిర్యాదులో జిల్లావ్యాప్తంగా 71 శాతం ఉన్నాయి.
సాక్షి, యాదాద్రి : ప్రజా సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం నామమాత్రంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ ప్రజాభవన్, జిల్లా కలెక్టరేట్, ఆర్డీఓ, ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నా, వాటికి సరైన పరిష్కారం లభించడం లేదని అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే 2023 డిసెంబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 09 వరకు మొత్తం 2,152 దరఖాస్తులు రాగా అందులో కేవలం 624 (29 శాతం) పరిష్కరించారు. మిగతావి పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇందులో రెవెన్యూ శాఖకు వచ్చిన భూ సమస్యల ఫిర్యాదులే అధికంగా ఉండడం గమనార్హం.
2023 డిసెంబర్ 12 నుంచి
ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు
మొత్తం దరఖాస్తులు 2,152
పరిష్కరించినవి 624
పెండింగ్‌లో ఉన్నవి 1,528
చర్యలు ప్రారంభించినవి 1,432
ప్రజావాణి అర్జీలపై అలసత్వం
ఫ సమస్యలు విని పెడచెవిన పెడుతున్న అధికారులు
ఫ రెండున్నరేళ్లలో వచ్చిన అర్జీలు 2,152
ఫ ఇప్పటి వరకు 29 శాతమే పరిష్కారం
ఫ అత్యధికంగా భూ సమస్యలఫిర్యాదులే పెండింగ్


