సాక్షి, యాదాద్రి : గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం భువనగిరి కలెక్టరేట్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణలతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 14న ప్రారంభం కానున్న వినాయక చవితి ఉత్సవాలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనానికి రూట్ మ్యాపులు, అవసరమైన మార్గాల్లో రోడ్ల మరమ్మతులు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. నిమజ్జన ఘాట్ల వద్ద భారీ క్రేన్లు, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య శిబిరాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లా ఎస్పీ అక్షాంక్ యాదవ్ మాట్లాడుతూ గణేశ్ విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో కమిటీ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. నిమజ్జనం వరకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, భువనగిరి మున్సిపల్ చైర్మన్ శ్రీవాణిరవికుమార్, భువనగిరి ఉత్సవ కమిటీ అధ్యక్షులు పసుపునూరి నాగభూషణం, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషిచేద్దాం
జిల్లాలోని పర్యాటక ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న జిల్లాల్లో వివిధ కార్యక్రమాల నిర్వహణపై రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీప్రసాద్ బుధవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పలు వివరాలు వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా యువజన, క్రీడల అధికారి ధనంజనేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరిస్తున్న అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంశ్ యాదవ్, అధికారులు
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి


