యోగాసన పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు
భువనగిరి : యోగాసనాల ద్వారా క్రీడాకారుల్లో ఏకాగ్రత పెరుగుతుందని భువనగిరి కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ చంద్రమౌళి అన్నారు. బుధవారం భువనగిరిలోని కేంద్రీయ విద్యాలయంలో 55వ కేవీఎస్ 2026–27 జాతీయ క్రీడాపోటీలు ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నారు. తొలిరోజు యోగాసనాల విభాగంలో బాలుర అండర్–14, 17, 19 విభాగాల్లో పోటీలు కొనసాగాయి. కార్యక్రమంలో కేవీ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పోల్గొన్నారు.


