యాదగిరిగుట్ట రూరల్ : జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామని నాబార్డు జిల్లా డెవలప్‌మెంట్ మేనేజర్ ఝాన్సీ అన్నారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని రైతు వేదికలో అజీవ ఫార్మర్స్, ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో జీవ వైవిధ్యం ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు రసాయనిక ఎరువులు లేకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు ఉపయోగించి పంటలను సాగు చేయాలన్నారు. స్థానిక పంటలను సంప్రదాయ విత్తనాలను పరిరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు వ్యవసాయ జీవ వైవిధ్యాన్ని అందించవచ్చన్నారు. జీవ వైవిధ్యమే పరిరక్షణ లక్ష్యంగా నాబార్డు ముందుకు వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పీస్ సంస్థ డైరెక్టర్ నిమ్మయ్య, ఏఓ సుధారాణి, పీఏసీఎస్ చైర్మన్ చీర శ్రీశైలం, నెమ్మాని సుబ్రమణ్యం, మాజీ జెడ్పీటీసీ అనురాధ, అజీవ ఏపీఓ సీఈఓ మహేష్, కోర్డినేటర్ వినోద్, డైరెక్టర్ కె.అరుణ, ఎల్లుబాయ్, స్వరూప, మౌనిక, లావణ్య, సుగుణమ్మ, లక్ష్మి, సునీత పాల్గొన్నారు.


