హామీల అమలుకు పోరాటం | - | Sakshi
Sakshi News home page

హామీల అమలుకు పోరాటం

Sep 8 2026 2:11 AM | Updated on Sep 8 2026 2:11 AM

భువనగిరిటౌన్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెయ్యి రోజుల్లో ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతూ ప్రభుత్వం అట్టర్‌ ప్లాప్‌ అయిందని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ఏడు రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా ఆయన పార్టీ నాయకులతో కలిసి సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పైళ్ల మాట్లాడారు. అనంతరం కలెక్టర్‌ అనురాగ్‌ జయంతికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చింతల వెంకటేశ్వర్లు, కొలుపుల అమరేందర్‌, జడల అమరేందర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

హైవేపై రాస్తారోకో

భువనగిరి: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమల్లో పూర్తిగా విఫలం అయ్యిందని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎదుట బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అక్రమ అరెస్టులను నిరసిస్తూ సోమవారం రాయగిరి పరిధిలో గల హైదరాబాద్‌–వరంగల్‌ హైవేపై రాస్తారోకో చేశారు. సీఎం ఫ్లెక్సీని దహనం చేయబోతుండగా పోలీసులు ఽఅడ్డుకున్నారు. రాస్తారోకోను విరమించుకోవాలని కోరినా ససే మిరా అనడంతో బలవంతంగా అక్కడి నుంచి తరలించే క్రమంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో శేఖర్‌రెడ్డితో పాటు మొత్తం 18 మందిని అరెస్టు చేసి వాహనంలో పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో చింతల వెంకటేశ్వరరెడ్డి, అమరేందర్‌, ఏవీ కిరణ్‌కుమార్‌, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, కిష్టయ్య, అబ్బగాని వెంకట్‌, వీరేషం, జక్కా రాఘవేందర్‌రెడ్డి, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement