భువనగిరిటౌన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తో కలిసి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన 77 అర్జీలను స్వీకరించారు. అందులో రెవెన్యూ శాఖ 53 , సర్వే ల్యాండ్స్ 5 శిశు సంక్షేమ 5, మున్సిపాలిటీ 3, డీపీఓ 2, హౌసింగ్ 2, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, విద్య, మత్స్య, విద్యుత్, లీడ్ బ్యాంకు, ఇరిగేషన్ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున వచ్చాయి. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ జయమ్మ, డిప్యూటీ కలెక్టర్ కతిక పాల్గొన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు
సాక్షి, యాదాద్రి: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల తనిఖీల్లో అలసత్వం వహించినా, ఫేషియల్ అటెండెన్స్ నమోదు చేసుకోకపోయినా, ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించే అధికారులను సస్పెండ్ చేస్తానని కలెక్టర్ అనురాగ్ జయంతి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెలాఖరు నాటికి కూడా నిర్దేశించిన హాస్టళ్ల తనిఖీలు పూర్తి చేయకపోతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం తప్పనిసరి అని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 1205 మంది ఉద్యోగులకు గాను ఇప్పటివరకు 995 మంది మాత్రమే ఈ విధానంలో నమోదయ్యారైనట్లు కలెక్టర్ తెలిపారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి


