పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన బైక్‌ | - | Sakshi
Sakshi News home page

పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన బైక్‌

Sep 8 2026 2:11 AM | Updated on Sep 8 2026 2:11 AM

యువకుడికి తీవ్ర గాయాలు

యాదగిరిగుట్ట : బైక్‌పై వెళ్తున్న యువకుడు పోలీసు వాహనాన్ని ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన యాదగిరిగుట్ట పట్టణంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాపేట మండలం బేగంపేటకు చెందిన అరవింద్‌ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. పనిలో భాగంగా సోమవారం బైక్‌పై యాదగిరిగుట్టకు వచ్చిన అతడు.. ఎంపీడీఓ కార్యాలయం వద్ద యూటర్న్‌ తీసుకుంటున్న పోలీసు వాహనాన్ని వస్తున్న ఢీకొని పక్కనే ఉన్న ఆటో కిందపడిపోయాడు. దీంతో అరవింద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసు వాహనం వెనుక అద్దం పగిలిపోయింది. వెంటనే స్థానికులు అరవింద్‌ను రోడ్డు పక్కన ఖాళీ ప్రదేశంలోకి తీసుకెళ్లి 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు.

సమయానికి రాని

అంబులెన్స్‌..

108 అంబులెన్స్‌ సమయానికి ఘటనా స్థలానికి రాకపోవడంతో 30 నిమిషాలకు పైగా అరవింద్‌ రక్తస్రావంతో అక్కడే పడి ఉన్నాడు. స్థానికులు, పోలీసులు వైద్యుడి సహాయంతో ప్రథమ చికిత్స అందించి ఆటోలో భువనగిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement