పెన్‌పహాడ్ : కోళ్లకు మందు పెట్టి చంపిన భార్యాభర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన పెన్‌పహాడ్ మండలం తంగెళ్లగూడెం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ రాములు తెలిపిన వివరాల ప్రకారం.. తంగెళ్లగూడెం గ్రామానికి చెందిన కాకునూరి బాబురావుకు చెందిన రెండు కోళ్లను అదే గ్రామానికి చెందిన కానుగు ఉపేందర్, అతడి భార్య సునీత కలిసి మందు పెట్టి చంపారని బాబురావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
పెద్దకాపర్తి చెరువులో డెవిల్ ఫిష్‌లు ప్రత్యక్షం
చిట్యాల : మండలంలోని పెద్దకాపర్తి చెరువులో సోమవారం చేపలు పట్టేందుకు స్థానిక మత్స్యకారులు వలలు విసరగా డెవిల్ ఫిష్‌లు చిక్కాయి. మరోవైపు చెరువులోకి తాము వదిలిన రవ్య, బొచ్చ, బురదమట్టలు వంటి చేపలు పెరగాల్సిన సైజులు పెరగలేదని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ చెరువుపై సుమారు వంద మత్స్యకార్మికులు ఆధారపడి ఉన్నారు. డెవిల్ ఫిష్‌ల నివారణకు అధికారులు తగిన చర్యలు, తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.


