చౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. గత మూడు రోజులుగా విజయవాడ మార్గంలో రద్దీ నెలకొనగా.. సోమవారం మాత్రం హైదరాబాద్ మార్గంలో వాహనాలు బారులదీరాయి. వివాహాలు, గ్రామ దేవతల పండుగలకు గ్రామాలకు వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణమవ్వడంతో హైదరాబాద్ వైపునకు వాహనాల రద్దీ పెరిగింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రద్దీ కొనసాగింది. జాతీయ రహదారిపై అండర్‌పాస్ బ్రిడ్జిల నిర్మాణ పనులు కొనసాగుతున్న చౌటుప్పల్, ధర్మోజిగూడెం, తూప్రాన్‌పేట గ్రామాల వద్ద వాహనదారులు, ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ట్రాఫిక్‌లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.


