నృసింహుడి నిత్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

నృసింహుడి నిత్య కల్యాణం

Sep 8 2026 2:11 AM | Updated on Sep 8 2026 2:11 AM

మఠంపల్లి : మట్టపల్లిలోని రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం నిర్వహించారు. క్షేత్రంలోని శివాలయంలో పార్వతీ రామలింగేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈఓ చలపతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, బ్రహ్మాచార్యులు, దుర్గాప్రసాద్‌శర్మ, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement