రంగనాథ రంగశాలను అద్దెకిస్తే నిరంతర నిర్వహణ ఉంటుంది. భవనం వినియోగంలోకి వస్తుంది. ప్రాజెక్టు అధికారులు కూడా అవసరమైనప్పుడు ఇక్కడ సమావేశాలు నిర్వహించుకోవచ్చు. ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుంది.
– శివ, స్థానిక వ్యాపారి
మినీ థియేటర్ ఏర్పాటు చేస్తా
రంగనాథ రంగశాలను అద్దెకిస్తే మినీ థియేటర్ ఏర్పాటు చేస్తానని రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రికి, స్థానిక ఎమ్మెల్యేకు దరఖాస్తు అందజేశాను. అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించుకోలేదు. అనుమతిస్తే మినీ థియేటర్‌గా అభివృద్ధి చేసి నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాను.
– మహేశ్వర్‌రెడ్డి, స్థానికుడు


