అత్యాచారం కేసులో ఇద్దరు యువకుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

అత్యాచారం కేసులో ఇద్దరు యువకుల అరెస్టు

Sep 7 2026 7:45 AM | Updated on Sep 7 2026 7:45 AM

హుజూర్‌నగర్‌ : అత్యాచారం కేసులో ఇద్దరు యువకులను హుజూర్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆదివారం సీఐ చరమంద రాజు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై ఇటీవల ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా అత్యాచారానికి పాల్పడిన కాంపాటి విరామ్‌ అలియాస్‌ రాము, పాముల ఆకాష్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

లారీ ఢీకొని

వస్త్ర వ్యాపారి మృతి

చిట్యాల : చిట్యాల పట్టణంలో ఆదివారం సా యంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక వస్త్ర వ్యాపారి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల పట్టణంలోని హరిక్రిష్ణ వస్త్రాలయం యజమాని బండారు జనార్దన్‌(67) సంతోష్‌నగర్‌లోని తన ఇంటి నుంచి సర్వీస్‌ రోడ్డులో వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జనార్దన్‌ రోడ్డుపై పడిపోగా.. ఆయన పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. జనార్దన్‌ మృతి పట్ల సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్‌ సంతాపం తెలిపారు.

అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు

ముగ్గురికి గాయాలు

మోత్కూరు : మండలంలోని పాలడుగు గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ నుంచి మహబూబాబాద్‌ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం కాగా.. కారులో ప్రయాణిస్తున్న శ్వేత, భార్గవ్‌ దంపతులతో పాటు వారి రెండేళ్ల కుమార్తెకు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్‌లో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఈ మేరకు విచారణ జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ సి. వెంకటేశ్వర్లు తెలిపారు.

గుప్త నిధుల కోసం తవ్వకాలు

8 మందిపై కేసు నమోదు

చివ్వెంల(సూర్యాపేట) : చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామ శివారులోని గిరిదుర్గంలో వెలిసిన లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఉమామహేశ్వరస్వామి ఆలయం ముందు శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. పోలీసులు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం గుంపుల, వల్లభాపురం, ఉండ్రుగొండతో పాటు సూర్యాపేటకు చెందిన పచ్చిపాల మధు, సైదులు, శివ, శ్రీకాంత్‌, వేదాద్రి, తుకారం, గోపి, ప్రణయ్‌, తిర్పయ్య, మరో ఇద్దరు కలిసి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండగా.. పక్కా సమాచారం మేరకు పోలీసులు ఆలయం వద్దకు చేరుకుని 8మందిని ఆదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఆలయ కమిటీ చైర్మన్‌ చకిలం కృష్ణకుమార్‌ ఫిర్యాదు మేరకు 8మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వి. మహేశ్వర్‌ తెలిపారు. దుండగుల వినియోగించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement