యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఆలయ క్యూలైన్లు, పరిసరాలు, మాడ వీధులు, ప్రసాద విక్రయశాల, కొండ కింద ఆధ్యాత్మిక వాడ భక్తులతో కిటకిటలాడాయి. కార్లతో కొండ పైన పార్కింగ్ నిండిపోవడంతో రింగ్ రోడ్డులోని టోల్‌గేట్ వద్ద వాహనాలను నిలిపివేశారు. కొండపైన వాహనాల రద్దీ తగ్గిన తర్వాతే మళ్లీ వాహనాలను పైకి అనుమతించారు. స్వామి వారి ధర్మ దర్శనానికి 3 గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంటకు పైగా సమయం పట్టింది. స్వామిని 50వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.61,09,833 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.
స్వామి వారిని దర్శించుకున్న
50వేల మందికి పైగా భక్తులు


