భువనగిరి : మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలో గల రమణేశ్వరంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన దేవతా విగ్రహాలకు ఆదివారం సిద్ధగురు రమణానంద మహర్షి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేంకటేశ్వరస్వామి, పంచముఖ ఆంజనేయస్వామి, బగలాముఖ అమ్మవారు, అయ్యప్ప స్వామి, హయగ్రీవస్వామి, ప్రత్యంగిరాంబ దేవతామూర్తుల విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం విశేష ద్రవ్యాలతో కుంభాభిషేకం చేశారు.
వేంకటేశ్వరస్వామి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ
చేస్తున్న రమణానంద మహర్షి


