రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

Sep 7 2026 7:33 AM | Updated on Sep 7 2026 7:33 AM

భూదాన్‌పోచంపల్లి : ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి హైదరాబాద్‌లో రెడ్డి భవన్‌ను నిర్మించాలని రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బద్దూరి వెంకటేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం భూదాన్‌పోచంపల్లిలో నిర్వహించిన రెడ్డి సంక్షేమ సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి కులస్తులకు అన్ని శాఖలలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో వేర్వేరు సంఘాలు కాకుండా ఒకే రెడ్డి సంఘం నిర్మాణమై తమ హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నల్ల సంజీవరెడ్డి, ప్రధానకార్యదర్శులు కొట్టం మధుసూధన్‌రెడ్డి, ఎన్నపల్లి లింగారెడ్డి, నాయకులు గంగిడి సుదర్శన్‌రెడ్డి, సగ్గు మల్లారెడ్డి, జిల్లా నాయకులు మర్రి నర్సింహారెడ్డి, కొట్టం కరుణాకర్‌రెడ్డి, పాటి సుధాకర్‌రెడ్డి, మద్ది అంజిరెడ్డి, కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బద్దూరి వెంకటేశ్వర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement