ఆయిల్‌ పామ్‌ సాగుపై ఆసక్తి | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ పామ్‌ సాగుపై ఆసక్తి

Sep 7 2026 7:33 AM | Updated on Sep 7 2026 7:33 AM

అధికారులను సంప్రదించాలి మార్కెటింగ్‌ సులభతరం కావాలి

రాజాపేట : ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని దీర్ఘకాలికంగా దిగుబడితోపాటు అధిక లాభాన్ని ఇచ్చే ఆయిల్‌ పామ్‌ సాగుపై రైతులు ప్రత్యేక దృష్టి సారి స్తున్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 1,196 మంది రైతులు దాదాపు 5,196 ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌తోటలు సాగు చేశారు. ఇందులో అత్యధికంగా రాజాపేట మండలంలో 109 మంది రైతులు మొత్తం 553 ఎకరాల్లో సాగు చేశారు. తర్వాత స్థానంలో ఆ తర్వాత స్థానంలో వలిగొండ, ఆత్మకూర్‌(ఎం), మోత్కూరుమండలాలు ఉన్నాయి. మొక్కలకే కాకుండా నాటేందుకు నీటి సరఫరా చేసేందుకు డ్రిప్‌ పరికరాలను ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తోంది. పైగా ఆయిల్‌ పామ్‌ సాగులో అంతర్‌ పంటల సేద్యానికి వీలు ఉంది. ఈ పంట ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలకై నా ఆయిల్‌ పామ్‌ సాగు తట్టుకోవడం, ఒక్కసారి నాటితే 4 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు దిగుబడి ఇస్తాయి. అయితే ఎకరానికి 10నుంచి 12 టన్నుల దిగుబడి రావడం మొక్కలు ఇచ్చిన డిపార్టుమెంట్‌ వారే పంటను కొనడం, సమీపంలోనే ఫ్యాక్టరీ ఉండడంతో రైతులు ఈ పంట సేద్యంపై మక్కువ చూపుతున్నారు.

ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీ

ఆయిల్‌ పామ్‌ సాగు కోసం ఓసీ, బీసీ సామాజిక వర్గాలకు డ్రిప్‌ కోసం 70 శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుంది. మొక్కల కోసం ప్రతి రైతుకు 80 శాతాన్ని ప్రభుత్వం సబ్సిడీ అందజేయగా 20 శాతాన్ని రైతు భరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రైతుకు ఎకరాకు ప్రభుత్వం చెల్లించే రైతుబంధు, రైతు బీమా యథావిధిగా ఎకరానికి రూ.4,200 చొప్పున నాలుగేళ్ల పాటు చెల్లిస్తారు. టన్ను పంటను రూ.23,400 ధరతో కొనుగోలు చేస్తారు. ఇలా ఒక్క రైతు 10 ఎకరాలు సాగు చేస్తే కాత దిగుబడి సమయంలో ఒక సాఫ్టువేర్‌ ఉద్యోగి సంపాదించినంతగా లాభం వస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఆయిల్‌ పామ్‌ సాగు ఇలా..

మండలం రైతుల విస్తీర్ణం

సంఖ్య (ఎకరాలు)

అడ్డగూడూరు 64 227.275

ఆలేరు 119 440.075

ఆత్మకూరు(ఎం) 92 465.475

పోచంపల్లి 30 157.225

భువనగిరి 62 272.475

బీబీనగర్‌ 29 150.25

బొమ్మలరామారం 76 297.475

చౌటుప్పల్‌ 83 335.925

గూండాల 60 244.6

మోటకొండూరు 58 237.525

మోత్కూరు 84 446

నారాయణపూర్‌ 55 199.55

రాజాపేట 109 553.125

రామన్నపేట 63 279.75

తుర్కపల్లి 59 242.45

వలిగొండ 109 489.275

యాదగిరిగుట్ట 44 158.525

మొత్తం 1,196 5,196.975

ఆయిల్‌ పామ్‌ పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహాకాలను అందజేస్తోంది. ఇందులో అంతర్‌ పంటలు సాగుచేసుకుని ప్రత్యామ్నాయ ఆదాయం పొందవచ్చు. ఆసక్తి ఉన్న రైతులు అధికారులను సంప్రదిస్తే వివరాలు తెలుపుతాం. అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

– మౌనిక, ఆయిల్‌ పామ్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌

నేను 25 ఎకకాల్లో ఆయిల్‌ పామ్‌ తోట సాగుచేశాను. ఎరువులు అందుబాటులో ఉండేచూడాలి. క్రాఫ్‌కు ప్రస్తుతం గిట్టుబాటు ధర ఉన్నప్పటికీ రైతులకు మార్కెటింగ్‌ సులభతరం చేయాలి. ఆయిల్‌ పామ్‌ సాగు రైతులకు పంట బీమా పెంచి అధిక దిగుబడి సాధించేలా ప్రోత్సహించాలి.

– వంచ వీరారెడ్డి, ఆయిల్‌ పామ్‌ రైతు, చల్లూరు

ఫ జిల్లాలో 5,196 ఎకరాల్లో పంట సాగు

ఫ రాజాపేట మండలంలో అత్యధికంగా 553 ఎకరాల్లో సేద్యం

ఫ 70 నుంచి 90 శాతం వరకు సబ్సిడీ

ఫ వివరాలకు 9100964625 నంబర్‌ను సంప్రదించాలంటున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement