యాదగిరిగుట్ట : గంధమల్ల రిజర్వాయర్‌ను త్వరలోనే పూర్తి చేసి 58వేల ఎకరాలకు సాగు అందించి ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామంలో గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆదివారం ఆయన భూమి పూజ చేసి పనులు ప్రారంభించి మాట్లాడారు. 1.41 టీఎంసీల సామర్థ్యంతో గంధమల్ల ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి గతేడాది తిర్మలాపురంలో సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. రైతులకు నష్టపరిహారం అందించిన తరువాతే భూమి పూజ చేసినట్లు తెలిపారు. పదేళ్ళు అధికారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఎందుకు గంధమల్ల పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మదర్ డెయిరీ చైర్మన్ మధుసూధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ చైతన్యరెడ్డి, ఆత్మ చైర్మన్ ఎనగందుల సుధాకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శంకర్ నాయక్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య


