సీఎం పర్యటనతో ఒరిగిందేమీలేదు | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనతో ఒరిగిందేమీలేదు

Sep 6 2026 2:19 AM | Updated on Sep 6 2026 2:19 AM

సాక్షి, యాదాద్రి : నకిరేకల్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటనతో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నయా పైసా లాభం లేదని జగదీష్‌రెడ్డి అన్నారు. నాలుగు బూతులు తిట్టడం తప్ప ఏం లాభం లేదన్నారు. వెయ్యిరోజుల కాంగ్రెస్‌ దగా పాలనపై శనివారం భువనగిరి పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ సమరభేరి కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యువజన, విద్యార్థుల ర్యాలీకి ఆయన హాజరై ప్రసంగించారు. అనంతరం విలేకరులతో కూడా మాట్లాడారు. తెలంగాణలో రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ అడ్రస్‌ లేకుండా పోతుందన్నారు. ‘ఇటీవల తెలంగాణ సీఎం మార్పు ఉంటుందని ప్రచారం జరిగింది. అధిష్టానానికి కొందరు ఫిర్యాదులు కూడా చేశారు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని సీఎంగా పెడతాం అంటున్నారు. కానీ, ఉత్తమ్‌ అంటే రేవంత్‌రెడ్డి ఒప్పుకోడు. ఆయన పేరు చూపించి.. కొంత హడావుడి చేసి, తర్వాత జానారెడ్డిని తెస్తారనేది ప్రచారంలో ఉంది. సీఎంగా రేవంత్‌ను తీస్తే తీయొచ్చు. ఆయన్ను తీసేస్తే, ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్‌ పార్టీ బతకదు’ అని జగదీష్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డిని సీఎంగా ఉండనిస్తే పార్టీ ఉండదన్న విషయం కాంగ్రెస్‌ వాళ్లకు కూడా స్పష్టంగా అర్థమైందన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికలకు ముందే బయటకు పోతాడన్నారు. రేవంత్‌రెడ్డి పార్టీలోనే ఉండి.. కొన్ని బీజేపీ సీట్లు గెలిచేటట్టు చేస్తారు. కొన్ని చోట్ల సొంత వాళ్లను కొంత గెలిపించుకుంటాడన్నారు. ఎన్నికల తెల్లారి గ్యాంగ్‌ను తీసుకుని బీజేపీలోకి వెళ్తాడు. ఇక కాంగ్రెస్‌ పార్టీ అడ్రస్‌ లేకుండా పోతది. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా అవుతుందని అని చెప్పారు. నకిరేకల్‌లో సీఎం టూర్‌ కోసం వందలాది పచ్చని చెట్లను అడ్డగోలుగా నరికేశారన్నారు.

పంపకాల్లో వాటా అడిగినందుకే

కొండా సురేఖ బర్తరఫ్‌

పంపకాల్లో వాటా అడిగినందుకే మాజీ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్‌ చేశారని ఆరోపించారు. ముఖ్య మంత్రి 18 గంటలు పనిచేస్తుంది డబ్బుల సంపాదన, భూముల ఆక్రమణ, వాటాల పంపికం కోసమేనని విద్యార్థి, యువజన విభాగం చెబుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్‌, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రైతు బంధు మాజీ కన్వీనర్‌ కొలుపుల అమరేందర్‌, చింతల కిష్టయ్య,ఏవి కిరణ్‌, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

ఫ రేవంత్‌రెడ్డి సీఎంగా ఉంటే కాంగ్రెస్‌ పార్టీ బతకదని అధిష్టానానికి తెలుసు

ఫ ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని ప్రచారం జరుగుతోంది

ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి వ్యాఖ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement