విద్యార్థులను తీర్చిదిద్దడంలో టీచర్లే కీలకం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులను తీర్చిదిద్దడంలో టీచర్లే కీలకం

Sep 6 2026 2:19 AM | Updated on Sep 6 2026 2:19 AM

ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య

జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం

భువనగిరి: విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై నవారిని సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ విద్యార్థులను భావి భారత పౌరులుగా తయారు చేయడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంటుందన్నారు. సమాజనంలోఉపాధ్యాయుల స్థానం ఎంతో పవిత్రమైందన్నారు. ప్రభుత్వం విద్యారంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తల్లిదండ్రుల తర్వాత గౌరవించేది గురువులని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉపాధ్యాయులకు అధిక ప్రాధాన్యమిస్తూ ఇప్పటి వరకు సుమారు 28వేల మందికి పదోన్నతులు కల్పించామన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులు సమస్యలను పరిష్కరించడంలో అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబోధనతో పాటు క్రమశిక్షణ, విలువలను నేర్పిస్తూ వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అవెజ్‌ చిస్తీ, జెడ్పీసీఈఓ శోభరాణి, డీఈఓ భిక్షపతి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement