నాగారం : నాగారం మండలం వర్థమానుకోటలోని పాటిమీదిగూడెం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు వర్దెల్లి మల్లయ్య ‘వినూత్న ఆలోచన– స్వీయ అభ్యాసం’ అనే భావనలతో ‘ఇన్ స్కూల్ యాక్టివిటీస్’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా గత 8 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సైతం ఉపయోగకరమైన ఆన్‌లైన్ వీడియోలను అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ యూట్యూబ్ చానల్ ద్వారా విద్యార్థులకు నవోదయ, గురుకుల, సైనిక, స్పోర్ట్స్ పాఠశాలల వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి అవసరమైన గణిత రీజనింగ్, మానసిక సామర్థ్య పరీక్ష, గణితంలో ప్రాథమిక భావనలు వంటి ఉపయోగకరమైన అంశాలను సులభ పద్ధతిలో అందిస్తున్నారు. విద్యార్ధులు ప్రాథమిక సామర్థ్యాలు పెంచుకోవడానికి ఉపయోగపడే విషయాలను, గణితం, ఇంగ్లిష్, తెలుగు, పరిసరాల విజ్ఞానం విషయాలకు సంబంధించి డిజిటల్ పాఠ్యాంశాల వీడియోలు అందిస్తూ.. విద్యార్థుల్లో పోటీ వాతావరణన్ని పెంచుతూ, తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగిస్తున్నారు.


