గణపయ్య రూపం.. సైబర్‌ పాఠం | - | Sakshi
Sakshi News home page

గణపయ్య రూపం.. సైబర్‌ పాఠం

Sep 5 2026 7:25 AM | Updated on Sep 5 2026 7:25 AM

భువనగిరిటౌన్‌, సూర్యాపేటటౌన్‌ : వినాయక చవితి పండుగ వేళ సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలను చైతన్యపరిచేందుకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. బొజ్జ గణపయ్య స్వరూపం నుంచే సైబర్‌ రక్షణ పాఠాలు నేర్చుకోవచ్చంటూ రూపొందించిన ప్రత్యేక అవగాహన పోస్టర్‌ ఆలోచింపజేస్తోంది. ‘వినాయకుడు మనకు నేర్పే పాఠాలు – సైబర్‌ విజ్ఞానం కలిగి ఉండండి’ అనే సందేశంతో రూపొందించిన పోస్టర్లు అన్ని వినాయకుల మండపాల వద్ద ఏర్పాటు చేయనున్నారు. ఉత్సవాల సందర్భంగా మండపాలకు పోటెత్తే భక్తులు, యువతలో సైబర్‌ భద్రతపై విస్తత అవగాహన కల్పించడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు ఈ ప్రత్యేక చర్యలు చేపట్టారు. సైబర్‌ నేరం ఎవరికై నా జరగవచ్చని, కానీ సరైన అవగాహన మాత్రమే ప్రతి ఒక్కరినీ రక్షిస్తుందని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌, బ్యాంక్‌ ఓటీపీల వివరాలు అడిగే సందేశాలు, ఆకర్షణీయమైన బహుమతుల పేరుతో వచ్చే నకిలీ లింకుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా సైబర్‌ నేరగాళ్ల బారినపడి మోసపోతే కాలయాపన చేయకుండా గోల్డెన్‌ అవర్‌లోగా 1930 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయాలని లేదా సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌ www.cyber crime.gov.in లో ఫిర్యా దు నమోదు చేయాలని పోలీసులు పిలుపునిచ్చారు.

ఫ ల్యాప్‌టాప్‌తో బొజ్జ గణపయ్య దర్శనం

ఫ అవయవాల విశిష్టతతో సైబర్‌

సూత్రాల అనుసంధానం

ఫ పోస్టర్లు రూపొందించిన పోలీస్‌ శాఖ

ఫ గణేష్‌ మండపాల వద్ద ఏర్పాటు

ఫ ఈ వినూత్న పోస్టర్‌లో.. విఘ్నేశ్వరుడు చేతిలో ల్యాప్‌టాప్‌తో దర్శనమిస్తూ, ఆయన అవయవాల ప్రత్యేకతలను సైబర్‌ సూత్రాలకు ముడిపెట్టి వివరించిన తీరు ఆకట్టుకుంటోంది.

ఫ పెద్ద చెవులు : సైబర్‌ నిపుణులు, పోలీసులు ఇచ్చే భద్రతా హెచ్చరికలను శ్రద్ధగా ఆలకించాలి.

ఫ చిన్న కళ్లు : ఆన్‌లైన్‌లో వచ్చే నకిలీ లింకులు, మోసపూరిత ప్రకటనలను వెంటనే నమ్మకుండా పరిశీలించాలి.

ఫ అభయ హస్తం : ఆన్‌లైన్‌ అనుమానాస్పద లింకులు, యాప్‌లు, కోడ్‌లను క్లిక్‌ చేయవద్దు.

ఫ పెద్ద తల : టెక్నాలజీ

వినియోగంలో ఆవేశం కాకుండా వివేకంతో, తెలివిగా వ్యవహరించాలి.

ఫ పొడవైన తొండం : కొత్త తరహా సైబర్‌ ముప్పులను ఎప్పటికప్పుడు పసిగట్టి, పరిస్థితులకు తగినట్లు అప్రమత్తం కావాలి.

ఫ చేతిలోని కలం: ఇంటర్నెట్‌, సామాజిక మాధ్యమాలను సమాజ హితం కోసం బాధ్యతాయుతంగా ఉపయోగించాలి. ముఖ్యమైన ఆన్‌లైన్‌ లావాదేవీల వివరాలను నమోదు చేసుకుని, అనుమానాస్పద లావాదేవీలపై వెంటనే స్పందించండి.

ఫ మోదకం : ఓటీపీ, పిన్‌, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్‌ ఖాతా వివరాలు వంటి రహస్య సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దు.

ఫ మూషిక వాహనం : డిజిటల్‌ సమాజంలో ఎంత ఎదిగినా అణకువ, క్రమశిక్షణ పాటించాలి. మొబైల్‌, ఇంటర్నెట్‌ను జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా ఉపయోగించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement