భౌతికశాస్త్ర బోధనలో వేణుగోపాల్‌ మార్క్‌ | - | Sakshi
Sakshi News home page

భౌతికశాస్త్ర బోధనలో వేణుగోపాల్‌ మార్క్‌

Sep 5 2026 7:25 AM | Updated on Sep 5 2026 7:25 AM

భౌతికశాస్త్ర బోధనలో వేణుగోపాల్‌ మార్క్‌

రామగిరి(నల్లగొండ): భౌతికశాస్త్ర బోధనలో వినూత్న విధానాలు, ఆధునిక సాంకేతికత, కృత్రిమ మేధస్సు వినియోగాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్‌ మెమోరియల్‌ బాలుర జూనియర్‌ కళాశాల ఫిజిక్స్‌ లెక్చరర్‌ గోన వేణుగోపాల్‌. దాదాపు మూడు దశాబ్దాలుగా అధ్యాపకుడిగా సేవలందిస్తున్న ఆయన.. విద్యార్థుల్లో శాసీ్త్రయ దక్పథం, భావనాత్మక అవగాహనను నింపడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల వనరుల రూపకల్పన పాఠాలను కంఠస్థం చేయడం కంటే సూత్రాలను, భావనలను లోతుగా అర్థం చేసుకోవడం పైనే ఆయన ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఇంటర్మీడియట్‌ విద్యార్థులతో పాటు జేఈఈ మెయిన్స్‌ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం ప్రథమ సంవత్సర పాఠ్యపుస్తకాలు, ప్రయోగాత్మక (ప్రాక్టికల్‌) పుస్తకాలు, కాన్సెప్చువల్‌ స్టడీ మెటీరియల్‌, ప్రశ్నాబ్యాంకులు, సంఖ్యాత్మక సమస్యల సాధన పత్రాలను రూపొందించడంలో ఆయన విశేష పాత్ర పోషించారు. కరోనా సమయంలో పాఠశాలలు, కళాశాలలు మూతపడినప్పటికీ విద్యార్థుల చదువుకు అంతరాయం కలగకుండా దూరదర్శన్‌ ద్వారా ప్రసారమైన విద్యా తరగతులకు కంటెంట్‌ క్రియేటర్‌గా వ్యవహరించారు. విద్యార్థులకు పాఠం చెప్పామా అన్న దానికంటే వారు నిజంగా ఆ భావనను అర్థం చేసుకున్నారా? అనే దానికే ప్రాధాన్యత ఇస్తానని ఆయన చెబుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement