సూర్యాపేటటౌన్: సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంగ్లిష్ లెక్చరర్ బానోతు వాసు విద్యాభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం, కళాశాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్నారు. మలబార్ గోల్డ్ సంస్థ సీఎస్‌ఆర్ నిధుల ద్వారా కళాశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల రూపంలో రూ.20 లక్షలకు పైగా ప్రయోజనం చేకూరేలా సంబంధిత సంస్థలతో సమన్వయం చేశారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన సాయాన్ని అందించడంలో చొరవ చూపారు. కళాశాలలో క్రమశిక్షణ, పరిశుభ్రత, బాధ్యతాయుతమైన ప్రవర్తన పెంపొందించడంతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల పెంపునకు విస్తృతంగా ప్రచారం చేశారు. వివిధ పాఠశాలలు, హాస్టళ్లను సందర్శించి విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇంటర్మీడియట్ విద్య ప్రాముఖ్యత, ప్రభుత్వ కళాశాలల్లోని సౌకర్యాలు, ప్రభుత్వ పథకాలు, స్కాలర్‌షిప్‌లపై అవగాహన కల్పించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ఆంగ్ల భాషా నైపుణ్యాలు, విద్యపై ఆసక్తిని పెంపొందించేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. బోధనను తరగతి గదికే పరిమితం చేయకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నారు. కళాశాలల్లో తనదైన శైలిలో విద్యార్థులను మోటివేట్ చేయడంతో పాటు కళాశాలల్లో అడ్మిషన్ల పెంపునకు కృషి చేస్తున్నారు. అంతేకాకుండా కళాశాలల్లో మొక్కలు నాటడం అంశాలపై తనదైన శైలిలో కృషి చేస్తున్నారు. బానోతు వాసు


