భువనగిరిటౌన్ : ప్రజావాణి అర్జీలను పెండింగ్ పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 74 దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 47, సర్వే, ల్యాండ్స్ 5, ఉపాధి కల్పన 3, గ్రామీణాభివృద్ధి 2, పంచాయతీ 2, మున్సిపాలిటీ 2, ఎంపీడీఓలు 2, బీసీ వెల్ఫేర్ 2, పంచాయతీరాజ్, వైద్యారోగ్య, సంక్షేమ, ఉద్యానవన, ఎల్‌డీఎం, చేనేత–జౌళి, మార్కెటింగ్, కో–ఆపరేటివ్, ఇరిగేషన్ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ జయమ్మ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు కృతిక, సాత్విక్ పాల్గొన్నారు.
హైవేల వెంట భారీ వాహనాలు
పార్కింగ్ చేయొద్దు
సాక్షి, యాదాద్రి : జాతీయ రహదారుల వెంట భారీ వాహనాలు, ట్రక్కులు పార్కింగ్ చేయవద్దని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా సోమవారం కలెక్టరేట్‌లో ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డితో కలిసి నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. రోడ్డుపై ఆక్రమణలు జరగకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రోడ్లు, భవనాల అధికారి సరిత, జిల్లా రవాణా అధికారి నరేష్, హైవే అథారిటీ అధికారులు పాల్గొన్నారు.


