ఇంగ్లిష్‌ వర్క్‌బుక్‌ రూపకల్పనలో శశికుమార్‌ ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్‌ వర్క్‌బుక్‌ రూపకల్పనలో శశికుమార్‌ ప్రతిభ

Sep 4 2026 7:17 AM | Updated on Sep 4 2026 7:17 AM

మోత్కూరు : రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) 8వ తరగతి ఇంగ్లిష్‌ వర్క్‌ బుక్‌ రూపకల్పనలో మోత్కూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మేకల శశికుమార్‌ భాగస్వామ్యమై తనదైన ప్రతిభ కనబర్చి ప్రశంసాపత్రం అందుకున్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి రూపొందించిన 8వ తరగతి ఇంగ్లిష్‌ వర్క్‌బుక్‌లో కంటెంట్‌ డెవలపర్‌గా ఆయన సేవలందించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, అంతర్లీన శక్తులను వెలికి తీసేలా అయన రాసిన డిస్కవరీ ట్రెజరీ విత్‌ ఇన్‌ యూ అనే కవిత ఆ వర్క్‌బుక్‌లో చోటు దక్కించుకుంది. ఎస్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో రూపొందిన ఈ వర్క్‌బుక్‌కు కంటెంట్‌ డెవలపర్‌గా ఎంపికై పాఠ్యాంశ రూపకల్పనలో తన వంతు కృషి చేసిన మేకల శశికుమార్‌ను మోత్కూరు జెడ్పీహెచ్‌ఎస్‌ హెచ్‌ఎం డి.అరవిందరాయుడు, సిబ్బంది సోమవారం అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement