చికిత్స పొందుతూ ఇద్దరు మహిళలు మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ ఇద్దరు మహిళలు మృతి

Sep 4 2026 7:17 AM | Updated on Sep 4 2026 7:17 AM

మిర్యాలగూడ టౌన్‌ : వేర్వేరు చోట్ల చికిత్స పొందుతూ ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఈ ఘటనలు మిర్యాలగూడ, నిడమనూరు మండలాల పరిధిలో పరిధిలో చోటుచేసుకున్నారు. మిర్యాలగూడ రూరల్‌ ఎస్‌ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గానగర్‌కు చెందిన కొమెర సైదమ్మ(39) తన భర్త గణేష్‌ను మద్యం సేవించవద్దని చెప్పినా వినకపోవడంతో మనస్థాపానికి గురై ఆగస్టు 30న పురుగుల మందు తాగింది. గమనించిన భర్త గణేష్‌, ఆయన కుమారుడు సాయితేజ ఆటోలో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆమె చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతురాలి తల్లి పిట్టల జ్యోతి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

నిడమనూరులో ఒకరు..

నిడమనూరు : ఆర్థిక ఇబ్బందులతో వివాహిత తల్లిగారింటికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల ప్రకారం నిడమనూరు చెందిన గోగుల లింగయ్య కుమార్తె సూజత(37)ను, నార్కట్‌పల్లి మండల ఎల్లారెడ్డిగూడేనికి చెందిన వరికుప్పల కృష్ణతో 20 ఏళ్ల క్రితమే వివాహమైంది. ఇటీవల తల్లిగారింటికి వచ్చిన సూజత ఈనెల 28న పేరుతెలియని మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. సూజతకు ఇద్దరు కుతూర్లు ఉండగా ఒకరికి వివాహమైందిది. మృతురాలి తండ్రి గోగుల లింగయ్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement