రామగిరి (నల్లగొండ) : నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో అర్థశాస్త్రం అసోసియేట్ ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్న డి. మునిస్వామి బోధన, పరిశోధనల్లో తనదైన ముద్ర వేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎంఏ, ఎం.ఫిల్, పీహెచ్‌డీ పూర్తిచేసి, యూజీసీ నెట్ సాధించిన మునిస్వామికి బోధనా రంగంలో 15 ఏళ్ల అనుభవం ఉంది. జాతీయ, అంతర్జాతీయ రీసెర్చ్ జర్నల్స్‌లో 30కి పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించడంతో పాటు, భారత ప్రభుత్వం నుంచి సుమారు 10 పేటెంట్లను పొందడం ఆయన పరిశోధనా ప్రతిభకు నిదర్శనం. యూపీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో ఉచితంగా కోచింగ్ అందించారు. కళాశాలలో అకడమిక్ కోఆర్డినేటర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, పరిశోధనా కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.
డాక్టర్ మునిస్వామి,
అసోసియేట్ ప్రొఫెసర్, ఎన్జీ కాలేజీ


