వలిగొండ : వలిగొండ మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సివిక్స్ అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పరుశురాములు రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపకుడి అవార్డు ఎంపికయ్యారు. ఈయన మోత్కూరు మండలం బుజిలాపురం గ్రామంలో జన్మించారు. ఈయన ఎంఏ, బీఈడీ, ఎల్‌ఎల్‌బీతో పాటు పీహెచ్‌డీ పూర్తి చేశారు. సుమారు 14 సంవత్సరాలుగా అధ్యాపక వృత్తిలో తనదైన రీతిలో విద్యాబోధన చేస్తూ వస్తున్నారు. ఆయన సేవలకు ఉత్తమ అధ్యాపకుడి అవార్డు వరించింది.
పరశురాములు, సివిక్స్ లెక్చరర్, ప్రభుత్వ కళాశాల వలిగొండ


