సూర్యాపేటటౌన్ : సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంగ్లిష్ జూని యర్ లెక్చరర్ బానోతు వాసు 2005లో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికై కొన్నాళ్లపాటు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 2012లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించారు. పలుచోట్ల పనిచేసిన ఈయన 2024లో సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వచ్చారు. బోధనతో పాటు విద్యార్థుల సంక్షేమం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. మలబార్ గోల్డ్ సంస్థ, సీఎస్‌ఆర్ నిధుల ద్వారా కళాశాల విద్యార్థులకు రూ.20 లక్షలకు పైగా ప్రయోజనం చేకూరేలా సంబంధిత సంస్థలతో సమన్వయం చేశారు.
బానోతు వాసు,
ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్, సూర్యాపేట


