భక్తి అంటే పూజలు చేయడం, కానుకలు ఇవ్వడం కాదు.. దేవుడి ముందు మనసును ఉంచి ప్రశాంత పరుచుకోవడమే. ఈ ఉద్దేశంతోనే ఆర్గానిక్ కృష్ణ మందిరం ప్రకృతి ఒడిలో ఉండేలా తీర్చిదిద్దాం. శ్రీకృష్ణ భక్తిని పెంపొందించడం, ప్రకృతిని పరిరక్షించడం, సనాతన ధర్మ విలువలను భవిష్యత్తు తరాలకు అందించడమే నా జీవిత లక్ష్యం. ఈ సంకల్పంతోనే మందిరాన్ని ఆధ్యాత్మిక, సేవా కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాం.
– పానుగుళ్ల వెంకటేశ్వర్లు,
ఆర్గానిక్ కృష్ణ మందిరం వ్యవస్థాపకుడు


