నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ బాలుర జూనియర్ కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న జి. వేణుగోపాలరావు డిజిటల్ కంటెంట్ అందించడంలో దిట్ట. కరోనా సమయంలో విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు చెప్పడానికి డిజిటల్ కంటెంట్ తయారు చేసి రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలకు అందించారు. దూరదర్శన్‌లోనూ డిజిటల్ కంటెంట్ అందించారు. ఏఐ ఛాన్సల్‌కు సంబంధించి జిల్లా కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తూ సాంకేతిక విద్యను విద్యార్థులకు అందించేందుకు కృషి చేస్తున్నారు.
జి. వేణుగోపాలరావు, ఫిజిక్స్ లెక్చరర్,
కేపీఎం ప్రభుత్వ కళాశాల నల్లగొండ


