రామగిరి (నల్లగొండ) : నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కెమిస్ట్రీ విభాగాధిపతి, అసోసియేట్ ప్రొఫెసర్ అమృత వసంత సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షలో ఆలిండిడియా 297వ ర్యాంక్ సాధించి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ హరి పద్మశ్రీ మార్గదర్శకత్వంలో నానో కాంపోజిట్ అంశంపై విస్తృత పరిశోధనలు చేసి 2024లో పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆమె పరిశోధనా పత్రాలు అంతర్జాతీయ, జాతీయ స్థాయి గుర్తింపు పొందిన పలు జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. తన పరిశోధనలకు గుర్తింపుగా రెండు భారతీయ పేటెంట్లను దాఖలు చేశారు. డిగ్రీ విద్యార్థుల కోసం 5 పాఠ్య పుస్తకాలను, పోటీ పరీక్షల నిమిత్తం మరొక పుస్తకాన్ని ఆమె రచించారు. జనవరి 2026లో నల్లగొండ ప్రభుత్వ మహిళా కళాశాలలో అంతర్జాతీయ సెమినార్లను ఆమె విజయవంతంగా నిర్వహించారు. అలాగే పలు అంతర్జాతీయ, జాతీయ సెమినార్లలో చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తూ పరిశోధనా పత్రాలను సమర్పించారు.
అమృత వసంత,
ప్రభుత్వ మహిళా ఉమెన్స్ కళాశాల, నల్లగొండ


