రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి

Sep 3 2026 8:41 AM | Updated on Sep 3 2026 8:41 AM

కేయూ క్యాంపస్‌ : స్నేహితుడిని రక్తదానం చేయించేందుకు తీసుకెళ్లిన ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృత్యుఒడికి చేరాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి హనుమకొండలోని పబ్లిక్‌ గార్డెన్‌ సమీపంలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన గుగులోత్‌ భరత్‌(21) కేయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈఈఈ మూడో సంవత్సరం చదువుతూ అక్కడే కాలేజీ హాస్టల్‌లో ఉంటున్నాడు. భరత్‌కు హనుమకొండ బస్టాండ్‌ సమీపంలోని ఓ బ్లడ్‌ బ్యాంకు నిర్వాహకులతో పరిచయం ఉంది. వారు అర్జెంట్‌గా రక్తం కావాలని భరత్‌కు ఫోన్‌ చేశారు. దీంతో భరత్‌ తన సేహితుడు సాయినికేతన్‌తో రక్తదానం చేయించేందుకు అదే కళాశాలకు చెందిన వేరే వ్యక్తి బైక్‌పై మంగళవారం అర్ధరాత్రి బ్లడ్‌ బ్యాంక్‌కు వెళ్లారు. సాయినికేతన్‌ రక్తదానం చేస్తుండగా కొంత సమయం పడుతుందని భావించిన భరత్‌.. ఆ బైక్‌ను సదరు వ్యక్తికి ఇచ్చి వస్తానని అంబేడ్కర్‌ సెంటర్‌ రోడ్డు వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో పబ్లిక్‌గార్డెన్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగి తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. బుధవారం ఎంజీఎంలో భరత్‌ మృతదేహానికి పోస్టుమార్టం చేయించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మి తెలిపారు. భరత్‌ మృతితో తల్లిదండ్రులకు శోకసముద్రంలో మునిగిపోయారు.

హనుమకొండలోని పబ్లిక్‌ గార్డెన్‌ సమీపంలో ఘటన

మృతుడు సూర్యాపేట జిల్లావాసి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement