భువనగిరిటౌన్ : ప్రమాదాల నివారణకే భువనగిరి మండలం సింగన్నగూడెం చౌరస్తా వద్ద నూతనంగా అండర్ పాస్ నిర్మించ తలపెడుతున్నామని ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన సింగన్నగూడెం చౌరస్తా వద్ద అండర్ పాస్ బ్రిడ్జి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. అంతుకుముందు బహార్‌పేట్ పాఠశాలలో చెట్టు కొమ్మ కూలి చనిపోయిన విద్యార్థిని కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు కూర వెంకటేశ్, అవైస్‌చిస్తీ, బర్రె జహంగీర్, మహ్మద్ అతహార్, బొంతల నర్సింగ్ రావు, ఈరపాక నరసింహ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి


