మహిళా ఉపాధికి ఈ–వాహనాలు | - | Sakshi
Sakshi News home page

మహిళా ఉపాధికి ఈ–వాహనాలు

Aug 29 2026 2:04 AM | Updated on Aug 29 2026 2:04 AM

సద్వినియోగం చేసుకోవాలి

ఆలేరురూరల్‌ : స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధికి ‘సీ్త్రనిధి’ వెన్నుదన్నుగా నిలుస్తోంది. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. పెరుగుతున్న కాలుష్య కారకాలను నియంత్రించేందుకు ప్రభుత్వం పర్యావరణ హితం కోసం ఈ–వాహనాలు (ఈ–ఆటో, ఈ–బైక్‌లు)అందిస్తోంది. ఇందుకోసం సీ్త్రనిధి ద్వారా రుణాలు విడుదల చేస్తోంది. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే సభ్యురాలి ఖాతాలో నగదు జమవుతున్నాయి. మంజూరైన ఈ–వాహనాలపై మహిళలు వివిధ రకాల చిరు వ్యాపారాలు చేస్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 10 మిల్లెట్‌ ఈ–వాహనాలను పంపిణీ చేశారు. లక్ష్యం లేకున్నప్పటికీ ఔత్సాహిక మహిళలను ఇటువైపు మళ్లించేలా అవగాహన కల్పిస్తున్నారు.

ఐదు రకాల రుణాలు

జిల్లాలో 14,875 సంఘాల్లో 1,62,546 మంది సభ్యులు కొనసాగుతున్నారు. ఏటా సీ్త్రనిధిలో రూ.60 కోట్లకుపైగా రుణాలు అందిస్తున్నారు. సీ్త్రనిధిలో ఐదు రకాల రుణ సదుపాయం కల్పిస్తున్నారు. సువిదలో రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు, ప్రగతిలో 50వేల నుంచి లక్ష వరకు, అక్షయలో రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు, సౌభాగ్యలో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు, ఐశ్వర్యలో రూ.5లక్షల వరకు రుణాలు పొందుతున్నారు.

అర్హతలు ఇవే..

అర్హులైన ప్రతి సభ్యురాలు ఈ–వాహనాల కొనుగోలుకు రుణం పొందే అవకాశం ఉంది. రుణాలు పొందేవారు గతంలో బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలు చెల్లించకుండా పెండింగ్‌ ఉండవద్దు. సభ్యుల కుటుంబాల్లోని ఎవరికై నా డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. ఎంచుకున్న వాహనాల కొటేషన్‌ తీసుకుని సీ్త్రనిధి అధికారులకు అందిస్తే మంజూరు చేస్తున్నారు. ఈ–ఆటోకు రూ.3లక్షల రుణం ఉంటే ప్రతినెలా రూ.6,700 కిస్తీ చొప్పున 60 నెలలు, ఈ–బైక్‌కు రూ.లక్ష రుణం ఇస్తే నెలకు రూ.2,660 కిస్తీలు చెల్లించాల్సి ఉంటుంది.

సీ్త్రనిధి ద్వారా మహిళలకు ఈ–వాహనాలకు రుణ సౌకర్యం అందిస్తున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో 10 మిల్లెట్‌ ఈ–వాహనాలను అందించాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తప్పనిసరిగా సంఘాల సభ్యులు దరఖాస్తులు చేసుకుంటే రుణాలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటాం.

– నాగిరెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

ఫ స్వయం సహాయక సంఘాల పరిపుష్టే ప్రభుత్వ లక్ష్యం

ఫ సీ్త్రనిధి రుణాలతో ఈ–ఆటో, ఈ–బైక్‌లు

ఫ ఇప్పటి వరకు పది మిల్లెట్‌ ఈ–వాహనాలు పంపిణీ

ఫ చిరు వ్యాపారాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రుణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement