ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Aug 28 2026 4:33 AM | Updated on Aug 28 2026 4:33 AM

సాక్షి యాదాద్రి : జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్‌, కార్మిక, పెన్షనర్ల పెండింగ్‌ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్‌ మందడి ఉపేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి, హామీలు ఇచ్చి నేటికీ అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వం న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకుంటే సెప్టెంబరు 10న లక్షలాది మంది ఉద్యోగులతో చలో హైదరాబాద్‌ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఉద్యోగులకు రావాల్సిన ఆరు పెండింగ్‌ డీఏలను ఏకమొత్తంలో విడుదల చేయాలని, సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జేఏసీ సెక్రటరీ జనరల్‌ ధరణికోట భగత్‌, అడిషనల్‌ సెక్రెటరీ జనరల్‌ కుంట్ల అమరేందర్‌ రెడ్డి, కో చైర్మన్లు యాదయ్య, చీకూరి జగన్‌, పదురి శ్రీకాంత్‌ రెడ్డి, టీఏన్‌జీఓ జిల్లా కార్యదర్శి ఎండీ ఖదీర్‌, కోశాధికారి కంచనపల్లి శ్రీకాంత్‌, ఉపాధ్యక్షుడు పెండెం శ్రీనివాస్‌, పెన్షనర్ల సంఘం అధ్యక్షులు మోహన్‌ రెడ్డి, బాలరాజు, అరుణ, శైలజ, ఆనంద్‌, ఎండీ అజీజ్‌ అలీ ఖాన్‌, శ్రీకాంత్‌, అశోక్‌ కుమార్‌, వినోద్‌ రెడ్డి, మొయిజున్నిసా బేగం, మాటూరి అశోక్‌, యదాద్రి దేవాలయ జేఏసీ నేతలు సురేంద్ర చార్యులు, రఘు, పరమేష్‌, శ్రవణ్‌, లక్ష్మీనరసింహ రెడ్డి, మెహతాబ్‌ సైదులు, పంచాయత్‌ సెక్రెటరీ ఫోరం అధ్యక్షుడు గణగాని శశికాంత్‌ గౌడ్‌, నరేందర్‌, శ్రీకాంత్‌, మెడికల్‌ ఫోరం అధ్యక్షుడు వెంకట రమణ రెడ్డి, గెజిటెడ్‌ అధ్యక్షుడు మురళీధర్‌ రెడ్డి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫ ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్‌ మందడి ఉపేందర్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement