ఆర్థిక స్వావలంబన సాధించాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక స్వావలంబన సాధించాలి

Aug 28 2026 4:33 AM | Updated on Aug 28 2026 4:33 AM

బొమ్మలరామారం: సంప్రదాయ పంటల సాగుకు ప్రత్యామ్నాయంగా ఉద్యానవన పంటల సాగుతో ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. బొమ్మలరామారం మండలంలోని మేడిపల్లి గ్రామంలో గురువారం సుక్క గణేష్‌ వ్యవసాయ క్షేత్రంలోని కూరగాయల సాగు, తిపిరిశెట్టి సత్యనారాయణ, వినయ్‌ పాలీ హౌస్‌లలో సాగు చేస్తున్న జెర్బెరా తోటను పరిశీలించారు. వ్యవసాయంలో వస్తున్న ఆధునిక విధానాలను అవలంబిస్తూ కూరగాయలు, పూలు, ఆయిల్‌ పామ్‌ పంటల సాగు చేయాలన్నారు. కలెక్టర్‌ వెంట జిల్లా ఉద్యానవన అధికారి హేమలత, మండల హెచ్‌ఓ కవిత, ఆయిల్‌ ఫెడ్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మౌనిక, ఏఈఓలు మధన్‌, మంజుల, సర్పంచ్‌ వేముల శ్రీలత నరేష్‌ ఉన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ

భువనగిరి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలందించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. గురువారం భువనగిరి పట్టణంలోని అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి వైద్య సేవలదించడంతో పాటు వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. హైరిస్క్‌ గర్భిణులను ముందుగానే గుర్తించి ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు. ఆస్పత్రిలో జరుగుతున్న ప్రసవాల సంఖ్య, ఆస్పత్రులకు వస్తున్న రోగుల సంఖ్య, అందిస్తున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ వెంట డీఎంహెచ్‌ఓ మనోహర్‌ సిబ్బంది ఉన్నారు.

ఫ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement