చౌటుప్పల్ నుంచి లక్కారంలోని అండర్‌పాస్ బ్రిడ్జి వరకు బారులుదీరిన వాహనాలు
లక్కారంలోని అండర్‌పాస్ బ్రిడ్జ్జి వద్ద నెలకొన్న
వాహనాల రద్దీ
చౌటుప్పల్ : రాఖీ పండుగ నేపథ్యంలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఏర్పడింది. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో వలిగొండ క్రాస్‌రోడ్డు నుంచి లక్కారం గ్రామంలోని అండర్‌పాస్ బ్రిడ్జి దాటిన తర్వాత వీవీ రెస్టారెంట్ వరకు వాహనాలు జామ్ అయ్యాయి. జంక్షన్‌లతోపాటు ఇతర ప్రాంతాల్లో రోడ్డు దాటేందుకు వాహనదారులు, స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. లక్కారం అండర్‌పాస్‌పై ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు సర్వీస్ రోడ్డులోకి తమ వాహనాలను మళ్లించారు. దీంతో అక్కడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.


