నేను గత రెండేళ్లుగా చిట్యాలలోని పీజేఆర్ రాఖీ కేంద్రంలో రాఖీలు కొనుగోలు చేసి మా స్వగ్రామం చౌటుప్పల్ మండలం పంతంగిలోని నా షాపులో విక్రయిస్తున్నాను. అతి తక్కువ ధరలో లేటెస్ట్ డిజైన్లలో రాఖీలు ఈ కేంద్రంలో దొరుకుతున్నాయి. దీంతో దుకాణదారులమంతా ఈ రాఖీ కేంద్రం నుంచే రాఖీలు కొనుగోలు చేస్తుంటాం. – చుక్క సమత,
పంతంగి, చౌటుప్పల్ మండలం
దుకాణదారులకు అతి తక్కువ ధరలతో, అందుబాటులో ఉండే ధరలతో రాఖీలను తయారు చేసి విక్రయిస్తున్నాము. మా కేంద్రం ద్వారా ఇంటి వద్దే ఖాళీ సమయంలో, ఇంటి పనులు చేసుకుంటూనే రాఖీలు తయారు చేస్తూ 120 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. తక్కువ ధరలలో అధునాతన డిజైన్లతో కూడిన రాఖీలను తయారు చేస్తుండటంతో పలు రాష్ట్రాల నుంచి హోల్‌సేల్, రిటైల్ దుకాణాదారులు, వ్యాపారులు సైతం ఇక్కడకు వచ్చి రాఖీలు కొనుగోలు చేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా సైతం రాఖీలు విక్రయిస్తున్నాం.
– ప్రొద్దుటూరి శ్రీనివాసులు,
పీజేఆర్ రాఖీ కేంద్రం, చిట్యాల


