సెప్టెంబర్ 1న పెన్షనర్ల విద్రోహదినం, సెప్టెంబర్ 10న చల్లో హైదరాబాద్ కార్యక్రమాలకు ఉద్యోగ జేఏసీ పిలుపు నిచ్చింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే జేఏసీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుంది. ఉద్యోగులకే అత్యధిక బడ్జెట్ వెళుతోంది అని ప్రచారం చేయడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. ప్రజాప్రతినిధులు, యంత్రాంగం రెండూ కలిస్తేనే పరిపాలన. ప్రజలకు సేవలు అందించేది ఉద్యోగులే. ఉద్యోగులను సమాజంలో శత్రువులుగా చిత్రీకరించడం సమంజసం కాదు. – మందడి ఉపేందర్‌రెడ్డి,
ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్
రెండునుంచి నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్, జీపీఎఫ్ లోన్లు, సరెండర్ లీవ్‌ల బిల్లులు తక్షణమే క్లియర్ చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగదు రహిత వైద్యం అన్ని అస్పత్రుల్లో చేయాలి.
– బాల్‌రాజు,
టాప్రా జిల్లా అధ్యక్షులు


