రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలు, పిల్లల చదువుల ఫీజులు, వైద్య ఖర్చులతో సగటు ఉద్యోగి కుటుంబంపై తీవ్ర భారం పడుతోంది. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలు, పీఆర్‌సీ పెంపు ఆలస్యం కావడం వల్ల ఒక సాధారణ ఉద్యోగి ప్రతి నెలా సగటున రూ.20 నుంచి రూ.30 వేల వరకు ఆదాయాన్ని కోల్పోతున్నాడు. మూడేళ్లుగా రావాల్సిన బెనిఫిట్స్ రాకపోవడంతో, ఉద్యోగులు తమ సొంత అవసరాలకే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
– శ్రీనివాస్, టీజీఏ జిల్లా ఉపాధ్యక్షుడు
ఉద్యోగులకు జీతాలు తప్పా ఏ విధమైన ఇతర బిల్లులు పాస్ కాక తీవ్రమానసిక, ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ బిల్లులు, స్టేషనరీ, ఆఫీస్ మెయింటెనెన్స్, పారిశుద్ధ్య నిర్వహణ బడ్జెట్ విడుదల కాలేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నాం.సరెండర్ లీవ్‌ల బిల్లులు నిలిచిపోయాయి. గ్రామ సేవకుల వేతనాలుమూడు నెలలుగా రాలేదు.
–ధరణికోట భగత్,
టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు


