ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోవాలి. ఉద్యోగుల సమస్యలన పరిష్కరించాలి.
– కె. యశోద, జేఏసీ మహిళా ప్రతినిధి
మా హక్కుగా వచ్చేప్రాధాన్యతలను ప్రభుత్వం అమలు చేయాలి. మూడేళ్లు దాటినా పీఆర్‌సీ అమలు కాకపోవడం చరిత్రలోనే ఇది మొదటి సారి. పీఆర్‌సీ నివేదికను తెప్పించుకుని వెంటనే అమలుచేయాలి. ఇంతకాలం ఓపిక పట్టిన ఉద్యోగులు ఇక వేచి చూసే ధోరణి ఉండదు. మా ఉద్యోగుల డిమాండ్ల సాధనకు పోరాటం సాగుతోంది.
– అమరేందర్‌రెడ్డి,
పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు


