గుట్టలో ప్రసాదం తయారీ విధానం ఎలా ఉంది | - | Sakshi
Sakshi News home page

గుట్టలో ప్రసాదం తయారీ విధానం ఎలా ఉంది

Aug 27 2026 1:48 AM | Updated on Aug 27 2026 1:48 AM

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో తయారు చేస్తున్న లడ్డూ, పులిహోర ప్రసాదం కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయవాడ శ్రీకనక దుర్గమ్మ ఆలయ ఈఓ సీనా నాయక్‌ ఆధ్వర్యంలో బృందం పరిశీలించింది. యాదగిరీశుడి ఆలయంలో ఇస్కాన్‌ సంస్థ ఆధ్వర్యంలో అధునాత టెక్నాలజీ కలిగిన మిషనరీని లడ్డూ, పులిహోర ప్రసాదం తయారు చేసేందుకు అందుబాటులోకి తీసుకువచ్చారు. విజయవాడ కనక దుర్గమ్మ వారి ఆలయంలోనూ ఈ మిషనరీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఈఓ సీనా నాయక్‌, ఏఈఓలు గంగాధర్‌, చంద్రశేఖర్‌, ఈఈ రమాల ఆధ్వర్యంలో పరిశీలించి, మిషనరీ పని తీరుపై గుట్ట దేవస్థానం డిప్యూటీ ఈఓ దోర్భాల భాస్కర్‌ శర్మ, అధికారులు మైపాల్‌రెడ్డి, అశోక్‌, దాసోజు నరేష్‌లను అడిగి తెలుసుకున్నారు. రోజుకు ఎంత పులిహోర ప్రసాదం, ఎన్ని లడ్డూలు తయారు చేస్తారని ఆరా తీశారు. అనంతరం కొండకు దిగువన నూతన అన్న ప్రసాద కేంద్రాన్ని పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఫ పరిశీలించిన విజయవాడ కనకదుర్గ ఆలయ బృందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement